![]() |
![]() |
.webp)
శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లేడీస్ స్పెషల్ గా డిజైన్ చేశారు. మహిళా దినోత్సవం సందర్భాంగా ఈ షో మొత్తాన్ని లేడీ ఓరియెంటెడ్ గా మార్చేశారు. ఇక ఇందులో జెస్సి తన లవర్ ని స్టేజి మీదకు తీసుకొచ్చి తాజ్ మహల్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. డెఫినిట్ గా బాగా చూసుకుంటాను అని చెప్పగలను అంటూ ఆ స్టేజి మీద జెస్సి ఆ అమ్మాయికి అందరి ముందు ప్రామిస్ చేసాడు. కిత్తురు చెన్నమ్మ, సరోజినీ నాయుడు, లక్ష్మి సెహగల్, కనకలత బారువా గెటప్స్ లో లేడీస్ అంతా కనిపించి ఒక ఇన్స్పిరేషన్ ని అందరిలో నింపేశారు. ఇక ఇంద్రజ ఈ షోలో ఒక ఇంటరెస్టింగ్ కామెంట్ చేశారు. "దయచేసి బూతులు తిట్టడానికి మమ్మల్ని వాడుకోకండి. మగాళ్లు మగాళ్లు కొట్టుకుంటున్నారా మీ పేర్ల తోనే తిట్టుకోండి..ఆడదానికి ప్రాణం పోయడమే కాదు...ప్రాణం తీయడం కూడా తెలుసు అని ఇలాంటి మహిళలు నిరూపించారు " అని చెప్పీ చెప్పనట్టు గిచ్చి గిచ్చనట్టు చక్కగా స్మూత్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళ పేర్లతో తిట్టడాలు, వాళ్ళ మీద బూతులు ప్రయోగించడాలు చూస్తున్నాం. షోస్ లో ఈ టైపు ఆఫ్ కామెంట్స్ ఉంటేనే ఆ షో మంచి రేటింగ్ వస్తుంది అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఈ విషయాన్నే హైలైట్ చేస్తూ ఇంద్రజ నిజాన్ని ఇలా చెప్పడంతో నెటిజన్స్ కూడా ఆమె కామెంట్స్ కి ఫిదా ఐపోతున్నారు. ఇక ఈ షోలో తాగుబోతు రమేష్ ని మరో సీనియర్ లేడీ కమెడియన్ ని తీసుకొచ్చి వాళ్ళతో స్కిట్ చేసేసరికి సుధీర్, రష్మీ ముసలి వాళ్ళు ఐతే ఇలా ఉంటారు అని కామెంట్ చేశారు. ఇలా ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ అలరించడానికి ఆదివారం ఆడియన్స్ ముందుకు రాబోతోంది.
![]() |
![]() |